Tuesday, 3 November 2026

పురపాలక సంఘంలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవం

బాన్సువాడ బిచ్కుంద జూన్ 02 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘంలో శుక్రవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను చైర్మన్ గంగాధర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సాధించగలిగామని, ప్రత్యేక రాష్ట్రం వల్ల అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసర,వికలాంగ పెన్షను, రైతుబంధు పథకం, రైతు భీమా, దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు, రైతులకు మరియు ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జుబేర్, కమిషనర్ రమేష్ కుమార్, ఆర్డీవో రాజాగౌడ్, సిబ్బంది శ్రీనివాస్, మసూద్, మల్లికార్జున్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.