చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్రం ఉద్యమ గొంతులకి ఇక సెలవు రాష్ట్ర ఉద్యమ నాయకులు అణగారిన వర్గాలను అణచివేయబడిన వర్గాల కోసం కదం తొక్కి పదం పాడిన గొంతుక తెలంగాణ ఉద్యమ కెరటం రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ మృతి పట్ల దిబ్బంతి వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించినారు చిలప్ చేడ్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమ గొంతుక సాయిచంద్ అకాల మరణం చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఏనలేని కృషి చేశారని ఆయన ఉద్యమ సమయంలో ఎక్కడ మీటింగులు జరిపిన అక్కడ ఆయన గొంతుకతో ప్రజలను ఉర్రూతలూగించినారు అణగారిన వర్గాల కోసం కదం తొక్కి గళం విప్పి తన గొంతుకతో పాటలు పాడి ప్రజల హృదయాలకు హత్తుకున్న సాయిచంద్ ఇక మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని ఇక రాష్ట్రంలో ఏ మీటింగ్ జరిగినా తన గొంతుక వినకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ గంగాధర్ సీనియర్ యూత్ నాయకులు కిషన్ రెడ్డి శంకర్ జైపాల్ వేణు అనిల్ తదితరులు పాల్గొన్నారు
ఉద్యమ గొంతుకకి ఇక సెలవు




