కొత్తగూడ జూన్ 29 జనం సాక్షి:ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర విభాగాల్లో నిరంతరం ఆటంకంగా ఉన్న ప్రధాన రోడ్డు…నర్సంపేట నుండి కొత్తగూడ వరకు రోడ్డు గుంతలతోప్రధానసమస్యగాఉంది.ఖమ్మం,ఇల్లందు,భద్రాచలం ప్రాంతాల నుండి వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులకు అదేవిధంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లే అత్యవసర విభాగాలు 108 వాహనాలకు తీవ్ర ఇబ్బందికరంగా మారడం జరిగింది.ఉమ్మడి ఖమ్మం నుండి అత్యవసర పరిస్థితుల్లో వరంగల్ ఆసుపత్రికి సైతం వెళ్లడానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఏకైక మార్గం…కొత్తగూడ,నర్సంపేట మార్గం ఈ ఒక్క మార్గానికి రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది.గత కొన్ని సంవత్సరాలుగా గుంతలమయమైన రహదారి,సంబంధిత అధికారుల అలసత్వంతో పలు ఇబ్బందులు పడుతున్న రోడ్డు ప్రయాణికులు….ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా కొత్తగూడ ఎస్ ఐ నగేష్ ఆధ్వర్యంలో ప్రమాదకరంగా ఉన్న గాదెవాగు స్థలానికి చేరుకుని గుంతలమయమైన రోడ్లను శ్రమదానంగా పోలీస్ సిబ్బంది మట్టిపోసి తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగింది.వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు,ప్రమాదాల నివారణకు శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పాడైపోయిన రోడ్డును బాగు చేసిన పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే రోడ్డు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మీరాక్షనే…మా బాధ్యత అంటూ కదం తొక్కిన ఎస్ఐ నగేష్




