టేకులపల్లి, మే 27 (జనం సాక్షి ): ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్మాదులుగా మారుస్తున్న కేంద్ర హిందుత్వ ప్రభుత్వంలో ఫాసిస్ట్ శక్తులు నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పి వై ఎల్ డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్)తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలు జూన్ 5,6లలో ఖమ్మంలో జరుగుతున్నాయని, ఈమహాసభలను విజయవంతం చేయాలని పివైఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్ పిలుపునిచ్చారు. ప్రగతిశీల యువజన సంఘం బివైఎల్ రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా మండల కమిటీ సమావేశం భూకి లక్ష్మణ్ అధ్యక్షతన మండల కేంద్రంలో శనివారం జరిగింది. రాష్ట్ర మహాసభలు పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటారెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకోవడం దుర్మార్గమైందని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాయని ఈ హామీలను అమలు చేయకపోవడంతో నిరుద్యోగ యువతలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు యువతను తప్పుదారి పట్టించేందుకు ఉద్రేకాలు,రెచ్చగొట్టే చర్యలు,మత ఉన్మాద చర్యలతో తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఉపాధి లేక నిరాశకు గురైన యువక




