Wednesday, 4 November 2026

ఉద్యోగనోటిఫికేషన్ల లో అభ్యర్థుల వయసు మినహాయింపు 2 సం. పొడిగించాలి

 

 

 

 

 

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావుమెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 10,జనంసాక్షి :జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రెగ్యులర్ గా రాలేదు..తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో మొన్నటి వరకు కూడా ఉద్యోగ నియామకాల ఊసే లేదు..రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీస్ పిఎస్సీ ద్వారా ప్రకటించిన నోటిఫికేషన్లలో అభ్యర్థుల వయో పరిమితి 18 నుండి 44 గా ప్రకటించారు.చాలా మంది అభ్యర్థులు పలు ప్రభుత్వ శాఖలలో గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు.. ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ల లో జనరల్ అభ్యర్థులు, కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోయారు.. గతంలో మాదిరిగా టిఎస్ పిఎస్సీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 5 సంవత్సరాలు వయసు పొడిగింపు ఇచ్చిన విధంగా అన్ని నోటిఫికేషన్లలో 2 నుంచి 3 సంవత్సరాల వయో పరిమితి పెంచి జనరల్ అభ్యర్థులుగా ఉన్న మరియు కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ గా కొనసాగుతున్న లక్ష మంది నిరుద్యోగులకు ఊరట కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ తరపున జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సేవదల్ అద్యక్షులు అందే మారుతి బాపూజీ, మెట్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పి రెడ్డి అంజిరెడ్డి,మండల ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డా.బెజ్జారపు శ్రీనివాస్, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ముహమ్మద్ నసీర్ లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..