చండ్రుగొండ జనం సాక్షి ఫిబ్రవరి 10: అపరిచిత వ్యక్తులతో అప్రమత్తం గా ఉండాలని ఏ ఎస్సై కృష్ణారావు అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. బ్యాంకు ఎకౌంట్, ఆధార్, ఎటిఎం పిన్ నెంబర్ లను ఇతరులతో పంచుకోకూడదన్నారు. ఫోన్ ద్వారా వచ్చే ఓటీపీ నెంబర్ ను, వ్యక్తి గత వివరాలు గొప్యంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




