Tuesday, 3 November 2026

ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేయాలంటూ  సమ్మెకు సిద్ధమవుతున్న  పంచాయితీ  సెక్రెటరీ లు నేటి నుండి హక్కుల సాధనకు దశలవారీగా పోరాటాలకు సిద్ధం

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి (ఏప్రిల్ 27)తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు గ్రామపంచాయతీ సెక్రటరీ పాలనలో అభివృద్ధిలో జాతీయస్థాయిలో దేశంలోనే మన పల్లెలు ఉత్తమ అవార్డులు సాధించడంలో సెక్రెటరీల పాత్ర మరువలేనిదని గ్రామపంచాయతీ సెక్రటరీల యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఆరే రాజు, కార్యదర్శి నరేందర్ ను అన్నారు.గ్రామపంచాయతీ సెక్రటరీల ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగుల సంఘం ఐక్య కార్యచరణ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెన్నార్ గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో హక్కుల సాధనకై ఉద్యోగులు  దశలవారీగా ఉద్యమాలను చేపట్టాలని తీర్మానించారు. దీంతో సమ్మెతో గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతి , కుంటు పడడం తప్పదని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఉద్యోగుల సంఘం నాయకులు ఆద్వర్యంలో  కలెక్టరేట్ కార్యాలయంలోని జెసి దీపక్ తివారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీల జిల్లా సంఘం అధ్యక్షుడు ఆరే రాజు, జనరల్ సెక్రెటరీ నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె లో అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని  గ్రామాలకు ఉత్తమ అవార్డులు పంట పండించడం లో గ్రామ పంచాయతీ సెక్రటరీల మెరుగైన సేవలు అందించడంలో పరిపాలనలో భాగస్వాములు అవుతూ క్రియాశీలకంగా పనిచేశారని అన్నారు.  సీఎం కేసీఆర్ ఆలోచనతో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలని పంచాయతీ సెక్రెటరీ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి హరితహారం పరిశుభ్రత గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ పరిపాలన లో భాగస్వామ్యం చేస్తూ పల్లెల అభివృద్ధిలో విజయం సాధించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ మరియు ఓ పి ఎస్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగులు ఉద్యోగంలో చేరారని అన్నారు. మూడు సంవత్సరాల పైగా ప్రొవిషన్ కాలం అనంతరం జీవో నెంబర్ 26 ద్వారా మరొక సంవత్సరం కాలాన్ని పెంచడం జరిగిందని అన్నారు. నాలుగు సంవత్సరాల ప్రొవిషన్ కాలం పూర్తయినప్పటికీ సర్వీసు పరిధిలోకి తీసుకోకపోవడం సెక్రెటరీ చేత ప్రభుత్వం వ్యట్టిచాకిరి చేయిస్తుందని ఆరోపించారు.పంచాయతీ సెక్రటరీ రెగ్యులర్ చేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ప్రతి మండల, జిల్లా కేంద్రంలో నేటి నుండి ఉద్యమాలు నిర్వహించి హక్కులను సాధించుకోవాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సలీం,  కవిత, పరమేష్, శ్రీనివాస్, చంద్రయ్య,  వెంకటేష్, రసూల్, స్వరూప, హేమలత, పద్మజ, రామకృష్ణారెడ్డి, మహేందర్, నవనీత, సైదులు, శ్రీనివాస్, మల్లేష్, కిష్టయ్య, గాంధీ,  దివమని, భాగ్యలక్ష్మి, పాండు, బాలకృష్ణ, జనరేంజన్, రజిత, సోఫియా, సిద్దేశ్వర్, సుధాకర్,  విజయ్, అనిషా తదితరులు పాల్గొన్నారు.