భువనగిరి టౌన్ జనం సాక్షి:–దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో చెలరేగుతున్న నియంతృత్వం అణిచివేత అరాచకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కన్వీనర్ మాజీ ఎంపీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు అన్నారు*
*ఈరోజు ప్రియతమ నేత భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీభవన్ లో నిర్వహించిన దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మీనాక్షి నటరాజన్ గారిని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, ఆద్వర్యంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పడిగెల ప్రదీప్, వడిచేర్ల శరత్ యాదవ్ , మహేందర్, మధు కలిసిన సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు నిర్వహించాల్సిన కార్యక్రమాల పట్ల దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా *మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ గారు మాట్లాడుతూ ఎఐసిసి, పీసీసీ, కార్యక్రమాలను కచ్చితంగా నిర్వహించి రాబోవు రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక నియంతృత్వ పాలనను అంతమొందించే వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ సైనికులుగా పనిచేస్తామని అన్నారు.




