ఉద్యోగ ఆశావహులకు మంచి నీటి సౌకర్యం కల్పించిన వనపర్తి సేవాదళం ట్రస్ట్

కోదాడ పురపాలక సంఘం పరిధి లోని బాలాజీనగర్ లో ఉన్నటు వంటి కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల కోసం  సిద్దమవుతున్న ఉద్యోగ ఆశావహులు ప్రాక్టీస్ సమయంలో మంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి రాగానే వెంటనే స్పందించిన ట్రస్ట్ చైర్మన్ వనపర్తి సేవా దళం ట్రస్ట్ తరుపున వారికి ప్రతి రోజు మంచి నీటిని ఏర్పాటు చేయించడం జరిగింది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్  వనపర్తి లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా వీరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి అన్న అందిస్తాం అని త్వరలోనే వీరికోసం లాంగ్ జంప్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు వార్డ్ కౌన్సిలర్ దరావత్ కైల స్వామినాయక్, పెండెం వెంకటేశ్వర్లు, గుండపునేని నాగేశ్వర రావు, ట్రస్ట్ సభ్యులు మైలారి శెట్టి సైదయ్య, లక్ష్మీ, కాసాని శివ, మరియు శంకర్, రమేష్,తులసిరామ్, రామ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు