Wednesday, 4 November 2026

ఉద్యోగ నియామకాలు,నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి.

ఉద్యోగ నియామకాలు,నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి.
-బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ కోవూరు సంతోష్ కుమార్.
-బిజెవైఎం ఆద్వర్యంలో రెవిన్యూ అధికారికి వినతిపత్రం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 29(జనంసాక్షి):
యువకులు, నిరుద్యోగులు పోరాడి, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ నియామకాలు జరపలేదని,ఉద్యోగ నియామకాలు లేక రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెవైఎం నాగర్ కర్నూల్ అసెంబ్లీ కన్వీనర్ కోవూరు సంతోష్ కుమార్ అన్నారు.బిజెవైఎం ఆద్వర్యంలో
మంగళవారం మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని కానీ వాటి అమలులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామంటూ నోటిఫికేషన్లు జారీ చేసి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగ నియామకం జరగలేదని తెలిపారు. నియామకాల జాప్యం వల్ల నిరుద్యోగులు, విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో, ప్రయివేట్ హాస్టలల్లో ఫీజులు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాగర్ కర్నూల్ టౌన్ అధ్యక్షులు నెల్లికొండ సుధీర్ కుమార్ గౌడ్ , నాయకులు వంగ శివ గౌడ్, మోహియోద్దీన్, సందీప్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.