Wednesday, 4 November 2026

తొలి అమరవీరుడు పోలీస్

తొలి అమరవీరుడు పోలీస్

కిష్టయ్య సంస్మరణ పోస్టర్ రిలీజ్
ఎస్సై రియాజ్ భాష

పెద్దవంగర నవంబర్ 29(జనం సాక్షి) తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య 13వ సంస్మరణ కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహించాలని మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కనుకుంట్ల నరేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై ఎస్ కే రియాజ్ భాషా చేతుల మీదుగా పోలీస్ కిష్టయ్య,సంస్మరణ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముదిరాజ్ మహాసభ మండల నాయకులు దాసరి శ్రీనివాస్,కనుకుంట్ల నవీన్, శోభన్ బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు