Thursday, 5 November 2026

ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తున్న విద్యార్థిని అభినదించిన మంత్రి ఎర్రబెల్లి

ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తున్న విద్యార్థిని అభినదించిన మంత్రి ఎర్రబెల్లి..

 

*దేవరుప్పుల,17(జనం సాక్షి): మండలంలోని నీర్మాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఇంటి.మల్లారెడ్డి కూతురు ఇంటి.కృష్ణవేణి ఎంబీబీఎస్ లో ర్యాన్క్ సాధించి రష్యా వెళ్తున్న సందర్భంగా ‘రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పంచాయితీ రాజ్,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి.దయాకర్ రావు’ కి వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా కార్యకర్తల బిడ్డలు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేవిధంగా చదువుకోవాలని..
సమాజానికి,రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఎదగాలని
నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపదవచ్చిన వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండేందుకు ఎల్లవేళలా ఉంటానని మంత్రి భరోసా కల్పించారు.