Thursday, 5 November 2026

ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు..ఆత్మస్థైర్యంతో ప్రతి మహిళ ముందుకు సాగాలి

– పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్
జనం సాక్షి, రామగిరి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నూరు లోని సాయిరాం గార్డెన్స్ లో విద్యార్థినీ విద్యార్థులకు రామగిరి పోలీస్ ఆధ్వర్యంలో మహిళా సురక్ష, మహిళ స్వశక్తి కరణ, ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ ఎంపవర్మెంట్ పలు అంశాల పై మహిళ భద్రత -పోలీస్ బాధ్యత అనే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్.(డిఐ జి ) , పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ , జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి సిపి రేమ రాజేశ్వరి మాట్లాడుతూ.. రామగిరి పోలీస్ ఆధ్వర్యంలో మహిళా సురక్ష, స్వసక్తి కరణం, ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ ఎంపవర్మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు ఆహ్వాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళల రక్షణకు తమ శాఖ దృష్టి సారిస్తుందని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ఇక్కడున్న పోలీసు అధికారులు, ప్రొఫెసర్ లు అందరూ ఇప్పుడు ఇలా మంచి హోదాలో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం చదువు. ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనంలో మంచిగా చదువుతూ యుక్త వయసు కాలేజీ జీవితంలోకి వచ్చాక నిర్లక్ష్యం తో జీవితం నాశనం చేసుకుంటారన్నారు. సక్సెస్ అనేది ఒక కొలమానంతో కొలిచేది కాదని జీవితంలో సమయపాలన క్రమశిక్షణ పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారం జీవితం కొనసాగించడమే అనేది సక్సెస్ అన్నారు. ఏ పని చేసినా పనిమీద ప్రత్యేక శ్రద్ధతో పట్టుదలతో ఇష్టపడి కష్టపడితేనే జీవితంలో అనుకున్న సాధిస్తారని కష్టపడకుండా నిర్లక్ష్యం వహిస్తే జీవితం కింది స్థాయికి చేరుకుంటుందన్నారు. విద్యార్థి దశ నుండి భవిష్యత్తు జీవితంపై ఒక క్లారిటీ ఉండాలని, ప్రతి స్థాయిలో కష్టపడుతూ తప్పులను సరిదిద్దుకుంటూ అనుకున్న స్థాయికి ఎదగాలన్నారు. చదువుకునే యుక్త వయస్సు లో యువతులు ప్రలోభాలు, ఆకర్షణలకు గురై భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని జీవితంలో ప్రతి స్టేజ్ ఇంపార్టెంట్ అని ఈరోజు మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు అని అంటే మీ తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి పని చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందని ఎప్పుడు మర్చిపోకూడదని తల్లిదండ్రులను అర్థం చేసుకొని గౌరవిస్తూ వారి కోరికలను నెరవేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మన దేశం ఎక్కడ లేనటువంటి ఉమెన్ ఓరియెంటెడ్ సేఫ్టీ ఇలా అనేక ఆవిష్కరణలలో భాగంగా మహిళల కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్, షీ షటిల్స్ ఇలా చాలా కార్యక్రమాలు మహిళా సురక్షిత భద్రత కోసం నిర్వహించడం జరుగుతుంది. మహిళా సురక్షిత అంటే మహిళలకు మాత్రమే బాధ్యత కాదు ఇది అందరి బాధ్యత. మీ ముందు ఎవరైనా విద్యార్థులను కానీ మహిళలను కానీ ఇబ్బందిలకు గురి చేయడం, ఈవ్ టీజింగ్ చేసినప్పుడు వారిని మీరు ప్రశ్నించాలి అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. అమ్మాయిలను బంధువులు కాని, ఇతరులు ఎవరైనా ఫోన్ కాల్స్ ద్వారా గాని మెసేజ్ ల ద్వారా గాని సోషల్ మీడియా ద్వారా గాని ఇబ్బందులకు గురి చేసినప్పుడు బాధితులకు అండగా ఉంటూ తప్పకుండా వారికి సపోర్ట్ చేస్తూ పోలీసులను సంప్రదించాలి అన్నారు. మహిళా భద్రత పోలీస్ బాధ్యత అనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, మంథని సీఐ సతీష్, రామగిరి ఎస్సై రవి ప్రసాద్, రామగిరి పోలీస్ వారిని సిపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, రామగిరి ఎస్సై రవి ప్రసాద్ మంథని ఎస్ఐ వెంకటేశ్వర్లు, మంథని ముత్తారం ఎస్సై రాములు, కళాశాల ప్రొఫెసర్స్, వాన్ని స్కూల్స్ టీచర్స్,పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.