Wednesday, 4 November 2026

ఉపసర్పంచుల డిజిటల్ సిగ్నేచర్ గల పెన్ డ్రైవ్ లను తిరిగి ఇవ్వాలి

ఉపసర్పంచుల డిజిటల్ సిగ్నేచర్ గల పెన్ డ్రైవ్ లను తిరిగి ఇవ్వాలి ఉప సర్పంచ్ యేకుల సురేష్ కొండమల్లేపల్లి జనవరి 7 జనం సాక్షి న్యూస్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సెంట్రల్ ఫండ్ నిధులు గ్రామపంచాయతీ పనులకు ఖర్చుపెట్టి వాటి లావాదేవీలు డ్రా చేసుకొనుటకు కొన్ని నెలల క్రితం సర్పంచ్ లకి ఉపసర్పంచ్ లకు వారి డిజిటల్ సిగ్నేచర్ గల పెన్ డ్రైవ్ లను అప్పగించారు. కొద్ది నెలల క్రితం వాటిని పై అధికారులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా సాఫ్ట్వేర్ ప్రాబ్లం దృష్ట్యా అని చెప్పి కలెక్ట్ చేసుకుని వారి వద్ద ఉంచుకున్నారు. ఉప సర్పంచ్లకు పెన్ డ్రైవ్ తిరిగి ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే పై అధికారులు తమ వద్ద ఉంచుకోవాలని సమాధానం ఇస్తున్నారు అన్నారు. అదేవిదంగా కొన్ని మండలాల్లో ఎంపీడీవోలను సంప్రదించగా వారు కూడా అదే సమాధానం ఇస్తున్నారు. ఈ విషయం పై ఉప సర్పంచుల ఫోరం నల్గొండ జిల్లా నాయకులు యేకుల సురేష్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వారిని ఫోన్ లో సంప్రదించి వివరణ కోరగా వారు అలాoటిది ఏదీ లేదని ఎవరి డిజిటల్ సిగ్నేచర్ పెన్ డ్రైవ్ వారి వద్ద ఉండాలని వివరణ ఇచ్చారని తెలిపారు. కావున రాష్ట్రంలోని పంచాయతీ శాఖ అధికారులు అందరి ఉప సర్పంచ్ ల డిజిటల్ సిగ్నేచర్లు గల పెన్ డ్రైవ్ లను వారికి తిరిగి చెల్లించాలని యేకుల సురేష్ ఓక ప్రకటనలో తెలిపారు.