బోయినపల్లి లో స్పెషల్ డ్రైవ్ 12 వాహనాలను సీజ్ కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ ఐ అభిలాష్
బోయిన్ పల్లి జనవరి 07 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లో శనివారం రోజున జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు బోయినపల్లి ఎస్ ఐ అభిలాష్ ఆధ్వర్యంలో తమ సిబ్బంది తో కలిసి బోయినపల్లి నుండి వేములవాడ,బోయినపల్లి నుండి కొదురుపాక వైపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న 12 వాహనాలను పట్టుకొని సీజ్ చేసి స్టేషన్ కు తరలించి నంబర్ ప్లేట్లు కనపడే విధంగా వ్రాయించి పెండింగ్ చలన్ల ను కట్టించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలతో పాటు నెంబర్ ప్లేట్లను సక్రమంగా పెట్టుకోవాలని నెంబర్ ప్లేట్ల లో ఏ ఒక్క అక్షరం తీసేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుని చీటింగ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ ఇలాగే కొనసాగుతుందని ఎస్ ఐ అభిలాష్ తెలిపారు. ఎస్ ఐ వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..




