ఉపాధిహామీ పనులపై సమీక్ష సమావేశం
వేమనపల్లి,నవంబర్ 17,(జనంసాక్షి)
గ్రామాలలో ఉపాధి హామీ పనులు వేగం పెంచి, ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య ఉపాధిహామీ సిబ్బందికి,పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో ఉపాధి హామీ పనులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీపతి బాపురావు మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం గ్రామపంచాయతీలలో కొనసాగించాలని,నర్సరీ నిర్వహణ ఉపాధి పనుల కల్పన కొత్త పనులు,తడిచెత్త పొడిచెత్త,వంద శాతం పన్నుల వసూళ్ల పై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో సత్యప్రసాద్,ఈసీ మధుకర్, పంచాయతీ కార్యదర్శులు,సాంకేతిక సహాయకులు,క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.




