గ్రామపంచాయతీకి కనీసం 20 మంది ఉపాధి కూలీలకు పని కల్పించాలి
* ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు
టేకులపల్లి, నవంబర్ 17( జనం సాక్షి): ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 20 మంది ఉపాధి హామీ కూలీలకు తగ్గకుండా పనులకు హాజరుకావాలని కూలీలకు సూచించారు. గురువారం మండలంలోని తావురియా తండా గ్రామపంచాయతీలో జరుగుతున్న ప్రభుత్వ పథకాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి దుద్దుకూరు బాలరాజు పరిశీలించారు. ముఖ్యంగా గ్రామంలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించి, ఉపాధి పనులకు కనీసం గ్రామపంచాయతీ నుంచి 20 మంది కూలీలకు తగ్గకుండా హాజరు కావాలని కూలీలతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఓ కాలంగి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రమేష్, గ్రామ కార్యదర్శి అజయ్ కుమార్, క్షేత్ర సహాయకులు నరేందర్ పాల్గొన్నారు.




