Thursday, 5 November 2026

బీసి భవన్ నిర్మాణ పనుల పరిశీలన.

బీసి భవన్ నిర్మాణ పనుల పరిశీలన.

ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లో రూ. 2 కోట్లతో నిర్మాణం జరుగుతున్న బీసీ భవన్ నిర్మాణ పనులను ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ పరిశీలించారు.

ఆయా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఇంజనీరింగ్ అధికారులు, క్షేత్రస్థాయిలో తరచూ పనులను పర్యవేక్షిస్తూ త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

అనంతరం నూతనంగా ప్రారంభం చేసుకున్న బీసీ స్టడీ సర్కిల్ భవనంను పరిశీలించారు. ఆయా భవనంలో కొనసాగుతున్న తరగతిలోని విద్యార్థులతో కలిసి మాట్లాడారు.

తరగతుల వివరాలు, పుస్తకాలు, ఇక్కడి సౌకర్యాలు, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు..

ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.