ఉపాధి కూలీలకు 600 రూపాయలు చెల్లించాలి…
జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు…
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 1
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు 600 రూపాయలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి, మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజు మాట్లాడుతూ మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజుకు 200 రూపాయలు కూలీ డబ్బులు చెల్లించాలన్నారు. ఉపాధి హామీ పనుల ప్రదేశంలో కూలీలకు చలువ పందిర్లు వైద్య సదుపాయాల కోసం మెడికల్ కిట్లు తాగునీటి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ ప్రధాన కార్యదర్శి మైదoశెట్టి యుగేందర్, కొమురయ్య సంపత్ తిరుపతి తో పాటు వివిధ గ్రామాల ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు 600 రూపాయలు చెల్లించాలి…




