పిల్లలకు ధనుర్వాతాము, కోరింత దగ్గు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
గద్వాల నడిగడ్డ, నవంబర్ 1 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలో అన్ని శాఖల సమన్వయం తో పిల్లలకు ధనుర్వాతము ,
కోరింత దగ్గు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టుటకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా వైద్యాదికారి, డి ఇ ఓ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో 5 వ తరగతి, 10 వ తరగతి చదువుతున్న10, 16 సంవత్సరాలు వయస్సు కలిగిన పిల్లలందరికి టి డి వ్యా క్సినేషన్ వేసేందుకు లిస్టు రెడీ చేయాలనీ, ఈ నెల 7 వ తేది నుండి 19 వరకు వ్యా క్సినేషన్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గ్రామ పంచాయతి వారిగా పంచాయతి సెక్రటరి, సర్పంచు సహకారం తో ప్రతి పాటశాలలో పిల్లలకు వ్యా క్సినేషన్ వేఇంచాలని తెలిపారు . అంగన్వాడి కేంద్రాలలో, అందుల పాటశాల ప్రతి పాటశాల పిల్లలకు వ్యా క్సిన్ వేయాలని తెలిపారు. జిల్లాలో 21,520 మంది పిల్లలలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యా క్సినేషన్ ప్రారంభ మైన రోజు నుండి ప్రతి రోజు రిపోర్ట్ పంపించాలని తెలిపారు.
సమావేశం లో జిల్లా వైద్యాదికారి చందు నాయక్,డాక్టర్ శశి కళ, డి ఇ ఓ సిరాజుద్దీన్, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు ధనుర్వాతాము, కోరింత దగ్గు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి




