మిర్యాలగూడ, జనం సాక్షిస్థానిక హౌసింగ్ బోర్డు లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు నేడు వెలువడిన పదవ తరగతి ఫలితాలలో విజయ ఢంకా మోగించారు. నూరు శాతం ఉత్తీర్ణత తో పట్టణం లోనే ప్రథమ స్థానం పొందారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సమావేశం లో 10/10 GPA సాధించిన డి . సాయి హరీష, 9.8/10 సాధించిన P. లక్ష్మీ చక్ర అఖిల, జె . సంజన రాజ్, 9.7/10 సాధించిన ఏ . సత్యప్రియ, 9.5/10 సాధించిన ఏ . ప్రతీక, వి . వెన్నెల, చీదళ్ళ ఫణి కుమార్ మరియు జి . సాత్విక్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు . కే .కే . జయరాజన్ అభినందిస్తూ విస్తృత మైన ప్రణాళికతో మరియు బోధనా సిబ్బంది సహకారం తో మొదటి నుండి అవిశ్రాంతంగా శ్రమించడం వలన ఈ ఖ్యాతి దక్కినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదివి నూరు శాతం ఉత్తీర్ణత ను సాధించారు . ఈ సమావేశంలో ఉపాధ్యాయ బృందం వెంకట్ రెడ్డి, అబ్దుల్ ఖలిం, వినోద్ చంద్రన్, వై . ప్రసాద్, జి . రాంబాబు, ఎం . అనిల్ కుమార్, ఎం . నవీన్ కుమార్, ఎండీ. జహంగీర్, ఎండీ. అజహరుద్దీన్, సి హెచ్ . రమేష్, మధు నాయర్, రవి కుమార్, ఉదయ్ కిరణ్ మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఇంత మంచి పేరు తెచ్చి పెట్టిన విద్యార్థులకు, సహకారం అందించిన తల్లి దండ్రులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.




