మెట్పల్లి, ఏప్రిల్ 29, జనంసాక్షి :మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం సంబంధించిన కూలీలు, మరియు ఎలక్ట్రిషియన్లు,తాపీ మెస్త్రీలు గా పని చేస్తున్న సుమారు 50 మంది కూలీలకు మెటుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు చొరవ తీసుకొని కూలీల సౌకర్యార్థం,వారి మేలు కోసం స్వయంగా సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేయించి శనివారం రోజున మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో దరఖాస్తుదారులకు లేబర్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా అర్హులైన లేబర్ కార్డులను పొందిన మహిళా కూలీలు, ఇల్లెందుల రాజు కు కృతజ్ఞతలు తెలియజేసి ఆనందం వ్యక్తం చేశారు.




