(జనం సాక్షి) ముప్కాల్ ఏప్రిల్ 29. మండల పరిధిలోని నల్లూరు గ్రామంలో ఎస్సై భాస్కరాచారి మరియు ఏఎస్ఐ తొగర్ల సురేష్ ఆధ్వర్యంలో అనేక అంశాలపై అవగాహనను కల్పించారు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 పరిచయం చేశారు అలాగే గల్ఫ్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని గ్రామ ప్రజలకు తెలియజేశారు నిరుద్యోగులు ముఖ్యంగా మోసపోవద్దని అలాగే ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని గ్రామపంచాయతీ పరిధిలో సీసీలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు మరియు మహిళలను అమ్మాయిలను వేధించినట్లయితే షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు అలాగే రోడ్డు భద్రత కార్యక్రమాలను గురించి హెల్మెట్ ధారణ ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించారు బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని తెలియజేశారు గ్రామంలో ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు




