పెద్దఅడిషర్లపల్లి ఏప్రిల్ 29(జనంసాక్షి):బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనువాద విధానాలు అవలంభిస్తు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని పి ఎ పల్లి మండలంలోని ఆజ్మాపూర్ గ్రామంలో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందన్నారు. నల్ల చట్టాలు తీసుకొస్తు కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అదుపులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరంచేస్తు, దేశ సంపద కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని, ఉద్యోగాలు భర్తీ చేయడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని,దళితులకు మూడు ఎకరాల భూమి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని,పోడు భూములకు పట్టాలివ్వాలని,రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్షి ఆర్ అంజయ్య నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే కాంతయ్య, సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,ఎండీ మైనుద్దీన్, బి వెంకటరమణ, టీ బుచ్చిరెడ్డి, కే జయరాములు, అచ్చయ్యా, జోజీ,భాస్కరరెడ్డి,చెండ్రై తదితరులు పాల్గొన్నారు.మండలం లోని ఆజ్మా పురం, వద్దిపట్ల మల్లాపురం, రామాపురం పీఏపల్లి, దుగ్యాల, తిరుమలగిరి, మేడారం, రంగారెడ్డిగూడెం, కోదండపురం, పోల్కంపల్లి, ఘనపురం, భీమనపల్లి, గన్ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. సిపిఎం జిల్లా కౌన్సిల్ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు.




