పెనుబల్లి, జూన్ 16(జనం సాక్షి) పెనుబల్లి మండలం లో శుక్రవారము సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలుసుకొని స్టెయి న్ లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ను పంపిణీ చేశారు, ఈ సందర్భం గా సండ్ర ఉపాధి హామీ కూలీల నుద్దేశించి
సీఎం కేసీఆర్ ప్రభుత్వం కూలీల పక్షపాతిగా, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ప్రతి ఏడాది ఉపాధి హామీ కూలీలను కలుసుకునే కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలోని లంకపల్లి, గురవాయిగూడెం, శ్రీనివాసపురం, కోండ్రుపాడు, పెనుబల్లి, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను స్వయంగా సండ్ర వెళ్లి కలుసుకొని ఎంఎల్ఏ సండ్ర, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ లను, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంపై కేంద్ర వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్పష్టతని కూలీలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేసి పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యంచేయాలని ఆలోచినస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూలీల సంక్షేమం కొరకుపనిచేస్తుందన్నారు.కార్యక్రమంలో ఎంపిపి శ్రీమతి లక్కీ నేని అలేఖ్య, ఎంపిడిఒ మహాలక్ష్మి, జెడ్ పి టి సి చెక్కిలాల మోహనరావు, మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకటరావు, కోటగిరి సుధాకర్ బాబు,ఆయగ్రామాల సర్పంచులు, ఎంపి టి సి లు, నాయకులు, కార్యకర్తలు, తదితరుల పాల్గోన్నారు,
ఉపాధి హామీ కూలీలకు స్టీల్ వాటర్ బాటిళ్లు,మజ్జిగప్యాకెట్లు పంపిణీ చేసిన సండ్ర




