ధర్మపురి 16 జూన్( జనం సాక్షి) ధర్మపురి పట్టణ అభివృద్ధి,పట్టణ సుందరికరణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నిజామాబాద్ జగ్దల్ పూర్ 63 వ జాతీయ రహదారి పై స్థానిక కమలాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఉదయం విగ్రహ ఆవిష్కరణగావించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితొద్దారకుడు, మేధావి, అంటరాని వాడని సమాజం వెలసిన వ్యక్తి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, తత్వశాస్త్రవేత్త, సంఘసంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్వాత్రంత్ర్య భారత తొలి న్యాయశాఖ మంత్రి, వృత్తిరీత్యా న్యాయవాది అంబేద్కర్ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎన్నో అసమానతలు, వర్ణకుల నిర్మూలనలో జీవితమంతా పోరాడిన మహాశక్తి అంబేద్కర్ అని దళితుల భవిష్యత్తుకు బాటలు వేసిన కాంతి కిరణం అనగారిన వర్గాల్లో వెలుగులు నింపిన వేగుచుక్క అంబేద్కర్ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతజాతి ఖ్యాతిని నిలబెట్టిన మహోన్నతుడు రచయిత ఆర్థికవేత్త బహుజనుల విధిరాతలను తిరగరాసిన మరో విధాత అంబేద్కర్ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. పాలనా దక్షుడు సమస్త భారతానికి దిక్సూచి అంబేద్కర్ అని అన్నారు. ప్రయాణాన్ని చూపించిన రాజకోవిదుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ద్వారానే భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్యం అందిందని అన్నారు. యావత్ విశ్వానికి ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను అందించిన ఆధునిక రాజనీతి విశ్లేషకుడిగా అందరి హృదయాల్లో నిలిచిపోతాడని కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి అదర్శప్రాయం అని బాల్యం నుండి ఎన్నో వివక్షతలు ఎదుర్కొంటూ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన మహోన్నతుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సంగీ సత్తేమ్మ జడ్పిటిసి అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసి చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ వెలగటూరు మండలం జెడ్పిటిసి సుధారాణి, మున్సిపల్ కౌన్సిలర్ తరాల కార్తీక్, దేవస్థానం ధర్మకర్త గుంపుల రమేష్, మహాజన సోషలిస్ట్ నియోజకవర్గ ఇన్చార్జి అరకిల్ల సతీష్, తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాగుల కాంతయ్య
ప్రధాన కార్యదర్శి దాసరి పురుషోత్తం, ఉపాధ్యక్షుడు పులి చంద్రయ్య కార్యదర్శులు పులి ప్రేమిత్, అసదు సత్యనారాయణ,ముడిమాడుగు శంకర్, ప్రచార కార్యదర్శి:దేవి అంజి
సంస్కృతిక కార్యదర్శి దాసరి చంద్ర శేఖర్,కోశాధికారి గంజాయిల గంగాధర్, ముఖ్య సలహాదారులు
చిలుముల లక్ష్మణ్,దొనకొండ నరేష్
గౌరవ అధ్యక్షులు బత్తిని అరుణ, జెడ్పీటీసీ ఎడ్ల చిట్టి బాబు ఎంపీపీ
టేకుమట్ల ప్రభాకర్, వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల




