టేకులపల్లి, ఏప్రిల్ 15( జనం సాక్షి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 28న చేలో కలెక్టరేట్ కార్యక్రమాలు విజయం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందగట్ల సురేందర్, జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు, కల్తి వెంకటేశ్వర్లు కోరారు. శనివారం మండలంలోని వజ్జ పాపయ్య కుంట,చింత బాలయ్య కుంటలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏఐకేఎంఎస్ టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోత్ రామచందర్ అధ్యక్షతన ఉపాధి హామీ కూలీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం[చట్టం]2005 లో పార్లమెంటులో చేయబడింది.272 రూపాయలు ఉపాధి కూలీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ కొలతల పేరుతోటి మోకాలుకి బోడ గుండుకి ముడిపెట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని,పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే సామాన్య ప్రజలు నడ్డి విరిసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పరిపాలనను కొనసాగిస్తున్నాయని అన్నారు. పెరుగుతున్న ధరల కనుగుణంగా జాతీయ గ్రామీణ ఉపాధి కూలీకి రోజు కూలి కొలతలతో సంబంధం లేకుండా 750 రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పని ప్రదేశం దగ్గర మంచినీరు, గుడారాలు,మజ్జిగ ప్యాకెట్లు,ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసిన స్లిప్పులు నెలలు తరబడి ఇవ్వకుండా ప్రభుత్వం నాన్చివేత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని, పనిచేసిన డబ్బులను నెలల తరబడి వారి అకౌంట్




