జనం సాక్షి, మంథని : మంథని ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించిన సమస్యలపై, వసతులపై ఆస్పత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి తో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శనివారం రివ్యూ నిర్వహించారు. మంథని ప్రభుత్వ వైద్యశాల, మాత శిశు కేంద్రంలో మౌలిక వసతులు, సదుపాయాలు లేక పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు ప్రభుత్వం నుండి వెంటనే కేటాయించాలని
కోరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో, మాత శిశు కేంద్రంలో పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యం కోసం వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, నిత్యం డాక్టర్లు పేషెంట్లకు అందుబాటులో ఉండాలని కోరారు. అత్యవసర అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. మంథని లో ప్రాంతంలో ఎక్కువగా కోతుల కరుస్తున్నందున వారికి సంబంధించినవి , పాయిజన్, స్నేక్ బైట్స్ ట్రీట్మెంట్ ఇంజక్షన్స్ అందుబాటులో ఉంచుకొని తొందరగా అందించాలని, ఇప్పుడు వేసవికాలం ఎక్కువగా వడదెబ్బ తాకి పేషెంట్లు ఆస్పత్రి వస్తూనందున వారికి సంబంధించి మెరుగైన సేవలు అందిస్తూ కొంత చల్లటి వాతావరణం ఏర్పాటు చేయాలి, కాబట్టి ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. మంథని ఆస్పత్రి అభివృద్ధికి ఇప్పటివరకు 2 సంవత్సరాల నుండి నిధులు కేటాయించక పోవడంతో ఆస్పత్రి అభివృద్ధికి పేషెంట్ల వసతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వేసవి దృష్ట నిధులు కేటాయించాలని కోరారు. జిల్లా కలెక్టర్ పేద్దపల్లి కి ఏదైనా నిధుల నుండి మంథని ప్రభుత్వం ఆస్పత్రి కి మాత శిశు కేంద్రానికి వసతులు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ద్వారా కోరామని తెలిపారు. మంథని ప్రభుత్వ ఆసుపత్రి, మాత శిశు కేంద్రంలో పనిచేస్తున్న సానిటేషన్ సిబ్బందికి ఇప్పటివరకు గత 8 నెలలుగా వేతనాలు అందలేదని మా దృష్టికి వచ్చినందున వారికి వెంటనే వేతనాలు ప్రభుత్వం మంజూరు ఇవ్వాలని కోరారు.




