Thursday, 5 November 2026

బిసిలకు రాజ్యాధికారమే లక్ష్యం. 

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 14 తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర ఓబిసి మోర్చ ఇంచార్జి బీహార్ రాష్ట్ర శాసన సభ్యులు అరున్ శంకర్ ప్రసాద్ అన్నారు.మల్కాజిగిరి బిజెపి కార్యాలయంలో జెల్లెల రవి యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి అతిథిగా ఆయన హాజరయ్యారు.ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ.గత కొన్నిరోజులుగా బిజెపి ఓబీసీ మోర్చా నిర్వహిస్తున్న పల్లెపల్లెకు ఓబిసి,ఇంటింటికీ బిజెపి అనే  పేరుతో దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని.ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి బిసిలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు.మన దేశంలో బిసిల సంఖ్య అధికంగా ఉందని బిసిలకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కూడా దాదాపు అరవై శాతం బిసిలు ఉన్నారని వారందరినీ కలుపుకొని ప్రణాళిక తో ముందుకు వెళ్తే ఇక్కడ కూడా మనం త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఆరు లక్షల కరపత్రాలు పంచామని, ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేస్తే తెలంగాణలో అధికారం మనదే నని అన్నారు.ఈసమావేశంలో స్థానిక కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి,సునీత యాదవ్, రాష్ట్ర నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్,ఆర్కే శ్రీనివాస్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంగేష్,సదానంద్ గౌడ్,దండుగుల వెంకటేష్,గోపాలకృష్ణ, మణి రత్నం,గున్నాల లక్ష్మణ్ గౌడ్, రీతు,సంతోష్,వినయ్,విటోభ,భజరంగ్, ఈగ లావణ్య కృష్ణ,సర్వేశ్ యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్,జిల్లెల భారతి యాదవ్,ఆవుల సంతోష్ యాదవ్, ఈసం రాకేష్,మనోజ్,వెంకట�