ఉపాధి హామీ పనులు నిర్వీర్యం
* రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలి
** మండల కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
** వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్
మానకొండూరు, నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 1( జనం సాక్షి)
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను నిర్వీర్యం చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా 200 రోజుల పని దినాలు కల్పించి 600 రూపాయల మూలవేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మానకొండూరులో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు హాజరై ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాలలో మంచినీరు, నీడ కోసం టెంట్లు, మెడికల్ కిట్లు తదితర సదుపాయాలను కల్పించాలని ఆయన కోరారు. శ్రీనివాస సమక్షంలో మంగళవారం మానకొండూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.
మండల అధ్యక్షులుగా తంగళ్ళపల్లి రాము (పెద్దూరుపల్లి), ఉపాధ్యక్షులుగా వంగ తిరుపతి (ఖాదర్ గూడెం) మండల కార్యదర్శిగా తంగళ్ళపల్లి సంపత్ (పెద్దూరుపల్లి) సహాయ కార్యదర్శిగా దాసరి నాగయ్య (చెంజర్ల) కార్యవర్గ సభ్యులుగా మరో పదముంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.




