Tuesday, 3 November 2026

భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి.

భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి.
-టీపీసీసీ నాయకులు వై.నరోత్తం
జహీరాబాద్ నవంబర్ 1 (జనంసాక్షి) రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర నవంబర్ 2 నుండి సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతుందని టీపీసీసీ నాయకులు వై.నరోత్తం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ,భారత్ జోడో యాత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి,ప్రజా సమస్యలు పాద యాత్ర ద్వారా తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ముఖ్య ఉద్దేశం,ఆయన ఒక లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నారు, జిల్లాలో పఠాన్ చెరు, సంగారెడ్డి, ఆందోల్,అల్లదుర్గ్,శంకరంపెట్,మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది,5 న జహీరాబాద్ పార్లమెంట్ పరిధి అల్లాదుర్గ్ లో బహిరంగ సభ జరుగును కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికి కోరేదేమనగ ప్రతి ఒక్కరు ఈ పాదయాత్రకు మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి.ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సబ్యులు మైనోద్దీన్,మాజీ సర్పంచ్ శంకర్,యం.డి.యూసుఫ్,మహ్మద్ షరీఫ్,కె.రాజు,పెంటన్న,పాండు,సంతోష్,తదితరులు ఉన్నారు