ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటిలో బిఇడి చేసుకునే ఆవకాశం
* టీఎస్ టి టి ఎఫ్ ప్రాతినిధ్యంతో కల్పించిన ఐటిడిఎ పి.ఓ
* ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ,టియస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
టేకులపల్లి, జనవరి 9( జనం సాక్షి ): ఎట్టకేలకు ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ లో బిఈడి చేసుకునే అవకాశం కల్పించారు. టీఎస్ టిటిఎఫ్ ప్రాతినిధ్యంతో ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ అవకాశం కల్పించారని టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. భద్రాచలంలో ఐటిడిఎ భద్రాచలం అధికారులు గత నాలుగైదు నెలలుగా భద్రాచలం ఐటీడీఏ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ లో ఆన్ డ్యూటి(OD) పై బిఇడి చేసుకునే అవకాశం ఇవ్వాలని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి(PO) పోట్రు గౌతమ్ని విన్నవించినా ఆన్ డ్యూడి సౌకర్యం ఇవ్వకుండ నిరాకరిస్తూ వస్తున్నారు.ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని,ఈ సంవత్సరం బిఇడి కి ఆన్ డ్యూటి(OD) సౌకర్యం ఇవ్వడం కుదరదని గత నాలుగైదు నెలల నుండి చెబుతూ వస్తున్నారు.అయితే మొదటి జనరేషన్ యస్సి/యస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్ లో ఆన్ డ్యూటి(OD)లో బి.ఇ.డి చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది.దానికి అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు కూడ ఉన్నాయి.అయితే ఐటిడిఎ పి.ఓ గారు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత,ఇతర కారణాల వలన నిరాకారిస్తూ వచ్చారు. సోమవారం బాధిత ఉపాధ్యాయులు టీఎస్ టిటిఎఫ్ సంఘ ప్రాతినిధ్యంతో ఇస్లావత్ లక్ష్మణ నాయక్ ఆధ్వర్యంలో ఐటిడిఎ పి.ఓ పోట్రు గౌతంని కలిశారు.
బిఇడి చేసుకోవడం వలన ఉద్యోగోన్నతి తో పాటు 12/18 సంవత్సరాల ఇంక్రిమెంట్లు వస్తాయని చెప్పి వివరించారు .పిఓ సానుకూలంగా స్పందించి రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని అన్నారని తెలిపారు .ఈ సందర్భంగా పట్టు శాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూక్య శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, బానోత్ రమేష్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్




