Wednesday, 4 November 2026

ఘనంగా పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం

-పద్మశాలి సంఘం కమిటీ ఎన్నిక

-మండల అధ్యక్షుడుగా శ్యామల సత్యం
-యూత్ అధ్యక్షుడుగా పారేపల్లి హరీష్

సిరోల్ జనవరి-9:జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో సోమవారం ఘనంగా పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తదనంతరం జిల్లా కమిటీ, పద్మశాలి సంఘం పెద్దల ఆధ్వర్యంలో నూతన మండలంగా ఏర్పడ్డ సిరోల్ పద్మశాలి సంఘం నూతన కమిటీని నియమించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న మాట్లాడుతూ సిరోల్ మండల అధ్యక్షులుగా శ్యామల సత్యం, ఉపాధ్యక్షులు భోగ ముని, చిట్యాల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కూరపాటి నరేష్, సహాయ కార్యదర్శి లు కుర్ర యాకయ్య, చెన్నూరి గంగయ్య, కోశాధికారి శ్రీను ను నియమించడం జరిగిందని, అదేవిధంగా మండల యూత్ కమిటీగా యూత్ అధ్యక్షుడు పారేపల్లి హరీష్, ఉపాధ్యక్షులు చిట్యాల నరేష్, శ్యామల నాగరాజు, ప్రధాన కార్యదర్శి భోగ వీరన్న, సహా కార్యదర్శి చెన్నూరి సురేష్, శ్యామల సాగర్ లను పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు కుల పెద్దల సమక్షంలో ఈ కమిటీలను నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు అన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్యామల సత్యం, యూత్ అధ్యక్షులు పారేపల్లి హరీష్ మాట్లాడుతూ మా మీద నమ్మకంతో మండల అధ్యక్షులుగా నియమించిన జిల్లా, రాష్ట్ర కమిటీ, సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి సంఘం బలోపేతం కోసం, సంఘం పెద్దలకు ఇలాంటి ఆపద వచ్చిన మా వంతు కృషి చేస్తామని వాళ్లు అన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలోజిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు చిలక మారి వెంకటేశ్వర్లు, వివిధ మండలాల అధ్యక్షులుశ్రీరాములు, పొద్దుల సురేందర్, మల్సూర్, దాసరి నరేందర్, దిగిజార్ల శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, తానంచర్ల సర్పంచ్ శ్వేత, యువజన సంఘం నాయకులు కస్తూరి శ్రావణ్ కుమార్, వివిధ గ్రామాల నాయకులు, కార్యదర్శులు జిల్లా నాయకులు యువజన సంఘం నాయకులు పద్మశాలి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.