Wednesday, 4 November 2026

తహశీల్దార్ కు వినతిపత్రం అందించిన బిజెపి అధ్యక్షుడు

తహశీల్దార్ కు వినతిపత్రం అందించిన బిజెపి అధ్యక్షుడు..

ధర్మపురి( జనం సాక్షి )పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు బెజ్జరపు లవన్ కుమార్, ఆధ్వర్యంలో ధర్మపురి తహశీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రం అందించి ఆయన మీడియాతో మాట్లాడుతూ,ఉచిత రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల కి బియ్యం పంపించి వారం రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా బియ్యం ఇవ్వక నిర్లక్ష్యం చేస్తుందని, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో పండుగ సమీపిస్తున్న ఇంతవరకు రేషన్ బియ్యం పంపిణీ చేయక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడిచి, ప్రభుత్వం వెంటనే రేషన్ షాపులు ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం ను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండారి లక్ష్మణ్, కస్తూరి శరత్, బాకి రాజేష్, నరెడ్ల శంకర్,నలుమసు వైకుంఠం,పొగుల గుండయ్య,పల్లెర్ల సురేందరు, కస్తూరి రాజన్న, అప్పం శ్రీనివాస్, ప్రణీత్,సంగి రాజేష్,అయ్యోరి సత్యం,సత్యనారాయణ,ఆనందసు నవీన్,శ్రవణ్,శివ.తదితరులు పాల్గొన్నారు.