Monday, 2 November 2026

ఉపాధ్యాయుల దండనతో విద్యార్ధి మృతి

భోపాల్‌: ఉపాధ్యాయులు విచక్షణ రహితంగా దండించిన ఘటనలో 9 ఏళ్ల విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బేతుల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న  విద్యార్ధిని ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా దండించారు. పాఠశాలలో బకెట్‌ను విరగొట్టినందుకు అతన్ని కొట్టినుట్లుగా సమాచారం. ఈ ఘటన రెండు వారాల క్రితం  చోటుచేసుకుంది. ఉపాధ్యాయుల దండనతో విద్యార్ధి వీపు, మెడ భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని మెదటగా స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం భోపాల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే విద్యార్ధి  పరిస్థితి విషమించి నిన్న మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *