టేకులపల్లి, ఫిబ్రవరి 10( జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను విడుదల చేయాలని హిందీ సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు భూక్య రాంబాబు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎటిఈసి అద్యక్షులు బాలునాయక్ కోరారు.ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బోజన విరామ సమయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ గత ఆరేడు సంవత్సరాలుగా బదిలీలు పదోన్నతులు లేక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ బదిలీ, పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నందా, శివ, వెంకటరమణ, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.




