Wednesday, 4 November 2026

ఫైలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించడం కోసం రక్త నమూనాల సేకరణ

 

 

 

 

 

 

 

టేకులపల్లి, ఫిబ్రవరి 10( జనం సాక్షి): జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశానుసారం ఫైలేరియాసిస్ అధికంగా ఉన్న గ్రామాలలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించడం కోసం రక్త నమూనాలను సేకరించె ప్రక్రియలో భాగంగా తావూరియా తండా గ్రామంలో గురువారం రాత్రి 10 గంటల తర్వాత 300 మందికి రక్త నమూనాలను ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సేకరించారు. ఫైలేరియా కి సంబంధించిన పారాసైట్ క్రిమి రాత్రిపూట మాత్రమే రక్తంలో సంచరిస్తుంది కాబట్టి ఆ సమయంలోనే రక్త నమూనాలను సేకరించడం జరిగింది. వీటిని రక్తపరీక్ష నిమిత్తం టీ హబ్ పరీక్ష కేంద్రానికి పంపించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సభ్ యూనిట్ అధికారి హరికృష్ణ,హెల్త్ అసిస్టెంట్లు మానస, స్వప్న, అనసూయ,స్రవంతి,దనసరి రాంబాబు, ఆశా కార్యకర్తలు సరోజ,రజియా, ముత్తమ్మ,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.