Thursday, 5 November 2026

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ప్రభుత్వం చొరవ చూపి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వేసవిలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయుల అక్రమ సర్దుబాట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు , ఏకరూప దుస్తులు సకాలంలో అందజేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు ఎన్.సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి జి.వెంకటయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జె.యాకయ్య, జిల్లా కార్యదర్శులు ఎస్ కె సయ్యద్, సిహెచ్.వీరారెడ్డి, ఎం.వెంకన్న, బి.పాపిరెడ్డి, ఎన్.నాగేశ్వర రావు, వి.రమేష్ , బి.ఆడమ్, ఎన్.సాంబయ్య, జె.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.