Thursday, 5 November 2026

హాత్ సే హాత్ జోడో కోఆర్డినేషన్ కమిటీలను ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

 

 

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 16 జనం సాక్షి న్యూస్ : ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మెరకు కొండమల్లేపల్లి మండలంలో ఈనెల 21 నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించు హాత్ సే హాత్ జోడో(యాత్ర) కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మండల కోఆర్డినేషన్ సమన్వయ కమిటీలను నియమించిన మాజీ శాసనసభ్యులు సభ్యులు, దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నేనావత్ బాలునాయక్, ఈ సందర్భంగా నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని అందులో భాగంగా ఈనెల 21 నుండి కొండమల్లేపల్లి మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా, యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కొండమల్లేపల్లి మండల సీనియర్ ముఖ్య నాయకులను కోఆర్డినేషన్ సమన్వయ కమిటీలలో ఆరుగురు సీనియర్ నాయకులను నియమించారు కమిటీ సభ్యులు గా పీసీసీ సభ్యులు పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ నాయిని మాధవ్ రెడ్డి, సీనియర్ కాంగ్రేస్ నాయకులు దూదిపాల శ్రీధర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు యం.ఏ. సిరాజ్ ఖాన్ మరియు మండల వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వేమన్ రెడ్డి లను మరియు హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమానికి మండల పర్యవేక్షకులుగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, పీసీసీ సభ్యులు చందంపేట పిఎసిఎస్ ఛైర్మెన్ జాలే నర్సింహారెడ్డి ని నియమించినారని తెలిపారు