ఉపా చట్టాన్ని రద్దు చేయాలి


సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో ఉపా చట్టాన్ని రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంకు అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు అధ్యక్షత వహించారు.అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ పీఎం మోడీ ప్రభుత్వం ప్రజా ఉద్యమకారులను నిరంకుశత్వంగా అణిచివేయడానికి ఎన్ఐఎతో ఉపా చట్టాన్ని ఉపయోగించుకొని జైలు పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలను అతిక్రమిస్తూ, టాడ, పోటా లాంటి చట్టాలను 2019లో సవరణ చేస్తూ ఉపచట్టాన్ని క్రూరత్వంగా మార్చారని,ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కూడా 152 మంది పైగా ఎలాంటి ఆధారాలు లేకుండా,చివరికి చనిపోయిన వారిపై కూడా దేశద్రోహ కేసులు నమోదు చేశారని అన్నారు.ఈ వ్యవస్థ మారాలని పాలకవర్గాలపై పోరాటం చేస్తున్న ముఖ్యంగా విప్లవకారులపై, మార్పు కొరకు పోరాడే వారిపై నిర్బంధాలను ప్రయోగించడం బిజెపి ప్రభుత్వానికి పరిపాటి అయిందని దుయ్యబట్టారు. సాయిబాబా, వరవర రావు చివరికి హరగోపాల్ సార్ పై కూడా ఉపా చట్టాన్ని ప్రయోగించడం అన్యాయం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక విలువలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఉపా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో అన్ని సంఘాలతో బలమైన పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ మోడీ, కేసీఆర్ లు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రజల కోసం పనిచేసే ప్రజా సంఘాల నాయకులపై నిర్బంధాన్ని ప్రయోగించడం అవివేకం అన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు సిపిఐ (ఎంఎల్ )రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ, బిసిపి జిల్లా కార్యదర్శి చామకూరి నరసయ్య,పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అవుల నాగరాజు, ఎల్ హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్,కోటయ్య, నాయకులు బాలస్వామి,ప్రజా నాట్యమండలి నాయకులు రాంబాబు,డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారావు,నారబోయిన వెంకట్ యాదవ్, బిఎస్పి నాయకులు దాసరి రాములు,రామకృష్ణ రెడ్డి,గంట నాగయ్య,కునుకుంట్ల సైదులు,బొడ్డు శంకర్,పిడమర్తి భరత్,సామా నర్సిరెడ్డి,నగేష్, బోల్ల్ వెంకన్న ,తడకమల్ల సంజీవ్, బోల్క పవన్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు