హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు మద్దతివ్వాలని తెరాస నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం తెరాసకు చెందిన 16 మంది ఎంపీలు మార్గరెట్ ఆళ్వాకు ఓటు వేయనున్నారు.పార్లమెంట్ భవనంలో శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఓట్ల లెక్కింపు జరగనుంది. రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్న ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు తెరాస మద్దతు




