Wednesday, 4 November 2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య ప్రధమ వర్ధంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య ప్రధమ వర్ధంతి వేడుకలు
పెద్దవంగర డిసెంబర్ 04(జనం సాక్షి )తమిళనాడు మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ప్రధమ వర్ధంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్ వి లక్ష్మి రామచంద్రయ్య శర్మ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఎదునూరి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కొత్త సత్యనారాయణ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తరువాత వారు మాట్లాడుతూ రాజకీయాల్లో, ప్రజా జీవితంలో రోశయ్య అత్యున్నత ప్రమాణాలను పాటించారని, వారి ఆదర్శాలు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీరాం రాము,తెరాస గ్రామపార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి మునుగోటి మధు, బ్రాహ్మణ పెళ్లి బిక్షపతి, మునుగోటి శ్రీనివాస్,ఇమ్మడి వెంకన్న, రమేష్, బిక్షపతి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.