నార్వయి పేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాం.
బెల్లంపల్లి, డిసెంబర్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నార్వయి పేట గ్రామంలో ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, బెల్లంపల్లి రూరల్ సీఐ కోట బాబురావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాం నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 8వరకు మావోయిస్టు పార్టీ పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్ఏ) వారోత్సవాల నేపథ్యంలో ఈకార్యక్రమం చేపట్టారు. ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది మొత్తం 30 మందితో నార్వయి పేట లో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగా లేని 20 బైక్ లు, 2 ఆటోలను, సిజ్ చేశారు.
ఈ సందర్భంగా నెన్నెల ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని వివరించారు. ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దన్నారు. మావోయిస్టుల ప్రలోబాలకు ఆకర్షితులు కావద్దన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అని అన్నారు. వాహనాల సంబందించిన అన్ని ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయం లో ఇన్సూరెన్స్ వర్తించదని, ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దానిని రెన్యూవల్ చేపించుకోవాలని సూచించారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కోసం ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే భరోసా కలిగించే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం లో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. మీ గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియని నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లను లింకును ఓపెన్ చేయొద్దు అని, అత్యాశకు పోయి లాటరీ వచ్చిందని, లోన్ వచ్చిందని వచ్చిన, ఏదైనా గిఫ్ట్ లు వచ్చాయని ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి లను పిన్ నెంబర్ లను చెప్పకూడదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నార్వయి పేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాం.




