Tuesday, 3 November 2026

ఉమ్మడి జిన్నారం మండలంలో కొత్త పంచాయతీల భవనాలు ఏర్పాటు చేయాలి

జిన్నారం జులై 1(జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఉమ్మడి జిన్నారం మండలాలలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ భవనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారం మండలం జగంపేట గ్రామంలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు!! కావలసిన ఫర్నిచర్ సొంత నిధులతో కొనుగోలు చేసి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఉమ్మడి జిన్నారం మండలాల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు హుస్సేన్,నాయకోటి రాజేష్, జంగంపేట్ సర్పంచ్ జోగు వెంకటయ్య, ఎంపిటిసి సభ్యుడు వెంకటేశం గౌడ్, కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.