జిన్నారం జులై 1(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. బిజెపి నాయకులు భారతీయ జనతా పార్టీ కేంద్రము నుండి ముఖ్య అతిధులుగా కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చిన తెలంగాణ విస్తారక్ “రవి జవాలగి”సమక్షంలో బొల్లారం మున్సిపల్ బిజెపి అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని వినాయక నగర్ కాలనీలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది!! ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కేంద్రంలోని కాకుండా రాష్ట్రంలో మరియు పటాన్చెరు నియోజకవర్గంలో కూడా బిజెపి జెండా ఎగిరే లాగ కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ గెలుపు దిశగా వెళ్లాల పనిచేయాలని కృష్ణారెడ్డి కోరారు! ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, సీనియర్ బిజెపి నాయకులు డి. రవీందర్ రెడ్డి, జి.రాఘవేందర్‌రెడ్డి, జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి,కావలి ఐలేష్, నరసింహారెడ్డి తదిర్లు పాల్గొన్నారు.
మహజన సంపర్కు అభియాన్ కార్యక్రమంలో భాగంగా హరితహారం చేపట్టిన బిజెపి




