Thursday, 5 November 2026

గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు.

గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు.
కోటగిరి మార్చి 22 జనం సాక్షి:-కోటగిరి మండలం లోని కోటగిరి,యాద్గార్ పూర్ గ్రామాలలో బుధవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలో కుస్తీ వీరులు పలు ప్రాంతాల నుండి వచ్చి హోరాహోరీగా కుస్తీ పోటీలకు తలబడ్డారు.ప్రతి సంవత్సరం ఉగాది రోజున కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు.రూ.20 నుండి ప్రారంభమైన కుస్తీ రూ.500,1000 వరకు కొనసాగింది.ఈ పోటీలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,గంగాధర్ దేశాయ్,సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు,గాండ్ల శ్రీనివాస్, సలీం,చిన్న సాయన్న,సాయాగౌడ్,పుల్కంటి కిష్టయ్య,ఆంజనేయులు,ఊషం సాయిలు,శ్రీధర్ , జాకీర్,ఆయా గ్రామాల పెద్దలు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.