ఉమ్మడి మానాలలో ఘనంగా సంక్రాంతి వేడుకల
రుద్రంగి జనవరి 15 (జనం సాక్షి)
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన సర్పంచ్ అల్లూరి మానస తిరుపతి,సరిత తిరుపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుద్రంగి మండల ఎంపిపి స్వరూప మహేష్,జడ్పిటిసి గట్ల మినయ్య,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేసిన ముగ్గులను పరిశీలించి బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉమ్మడి మానాల మరియు తండాలో ముగ్గుల పోటీలను నిర్వహించడం మంచి పరిణామమనీ ముగ్గుల పోటీలకు ఇంత మంచి ఆదరణ వస్తదని అనుకోలేదని తెలిపారు.ఈ సందర్భంగా యువతులు వేసిన సంప్రదాయ ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.సుమారు 100 మంది పోటీలో పాల్గొనగా పోటీలో మొదటి బహుమతి దేగవత్ లత,రెండవ బహుమతి బానోత్ సముద్ర,మూడవ బహుమతి కునుసోత్ స్వప్న నరేష్,నాలుగవ బహుమతి కునుసోత్ జ్యోతి గెలుచుకున్నారు.వాలీబాల్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.పోటీలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ బహుమతి ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, రుద్రంగి సొసైటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్,మాజీ వైస్ ఎంపీపీ రాజారాం,ఉప సర్పంచ్ రవిక రాజు,వార్డ్ మెంబర్ జ్యోతి తిరుపతి,అంబృత,శారద తండ వాసులు దేవ,భూపతి,నాయకులు తిక్క భుమన్న,నాయిని రాజేశం,రమేష్, మహిళలు గ్రామ పేద మనుషులు తదితరులు పాల్గొన్నారు.




