Thursday, 5 November 2026

దేవరకొండ అభివృద్ధికి సహకరిస్తా

దేవరకొండ అభివృద్ధికి సహకరిస్తా
– గోదాదేవి ఆలయ అభివృద్ధికి 6 కోట్ల నిధులు మంజూరు
శాసనమండలి చైర్మన్ గుత్తా
నల్గొండ బ్యూరో,జనం సాక్షి.
దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని శ్రీ గోదా రంగనాథుల తిరు కల్యాణ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై,గోదా దేవి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గోదాదేవి ఆలయ అభివృద్ధికి కమిటీ నిర్వాహకులు, స్థానిక ఎమ్మెల్యే రవీందర్ నాయక్ లు 8 కోట్ల నిధులు కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తేగా 6 కోట్లు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారన్నారు , దేవరకొండ నియోజకవర్గానికి తనకు విడదీయరాని అనుబంధం ఉందని నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి తనను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇందుకు నిదర్శనం యాదాద్రి దేవాలయం అని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అవిరెళ చేస్తున్నారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కూడా తెరాసహయంలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.. కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ అర్చకులు మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రెడ్డి.ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ లను ఆశీర్వదించారు..
ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా, ఎంపీపీ జానీ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్,దేవరకొండ నియోజకవర్గ టి ఆర్ ఎస్ నేతలు,వ్యాపారవేత్త డివియన్,సీనియర్ నాయకులు యామా దయాకర్ తదితరులు పాల్గొన్నారు