తెలంగాణ వచ్చాక పరిశ్రమలకు,వ్యవసాయానికి నిరంతర సరఫరా
ఇదే తెలంగాణలో అతిపెద్ద విజయం: టీఐఎఫ్
హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి): ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పరిశ్రమల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నదని టీఐఎఫ్ సభ్యులు అన్నారు. పరిశ్రమలకు కేవలం నాలుగు గంటల విద్యుత్ ఇచ్చారని, ఒకవేళ ఎవరైనా రాత్రి పూట పరిశ్రమలు నడిపినట్టు తేలితే నిర్బంధంగా రెట్టింపు బిల్లులు వసూలుచేశారని గుర్తుచేశారు. విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు నడవక అప్పులపాలై కార్మికులను తొలిగించడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా విద్యుత్ సరఫరా చేసి తమను కాపాడాలంటూ పరిశ్రమల యజమానులు ధర్నాలు చేసిన చరిత్ర వినలేదని, అలాంటిది 2014కు ముందు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేశామని గుర్తుచేశారు. వ్యవసాయ, పారిశ్రామికరంగాలతోపాటు గృహ
వినియోగానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న దేశంలోనే తొలిరాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాలుగేండ్లలో విద్యుత్‌రంగంపై రూ.20,177 కోట్లు వెచ్చించారన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్‌ను, పార్టీ అధినేత కేసీఆర్‌పై అనేక విమర్శలు చేశారని, తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు అలుముకుంటాయని, విద్యుత్ అసలే రాదని శాపనార్థాలు పెట్టారని విమర్శించారు. దానికి కేసీఆర్ ఖండించి అన్నీ సాధ్యమే అవుతాయని, దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ప్రెస్‌విూట్ పెట్టి చెబితే అక్కడున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆంధ్రా నాయకులకే వత్తాసు పలికారని గుర్తుచేశారు. ప్రపంచంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందడానికైనా ప్రధాన కారణం, మూలం విద్యుత్ వినియోగమేనని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యుత్ వినియోగం 122 శాతం పెరిగి దేశంలోనే తలసరి వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని సెంట్రల్ ఎలక్టిస్రిటీ అథారిటీ ఇటీవల ప్రకటించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి దార్శనికత, స్వీయ దర్శకత్వంలో సీఎండీలు, అధికారులు, సిబ్బంది, కార్మికుల సమిష్టి శ్రమ ఫలితమే నేటి విద్యుత్
వెలుగులని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విజన్, పాలన దక్షతకు విద్యుత్ విజయం నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు తిరుగకముందే అన్నిరంగాలకు నిరంతర విద్యుత్‌ను అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.




