బషీరాబాద్ జనవరి 28,(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామంలో శుక్రవారం రోజున ఘనంగా ఉరడమ్మ జాతరను నిర్వహించారు.మొదటగా తిరుపతి నుండి వేద పండితుల చేత బొడ్రాయిని ప్రతిష్టాపించారు.అనంతరం గ్రామ దేవతకు ఊరడమ్మకు గ్రామ ప్రజలు భారీ ఎత్తున బోనాలుతో,దీప ధూప నైవేద్యాలతో,డప్పుల చప్పుడుతో ఊరడమ్మ గ్రామ దేవతకు ఘనంగా పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, ప్రతాపరెడ్డి, అమృత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భీమ్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి, భారీ ఎత్తున గ్రామ ప్రజలు,భక్తులు,గ్రామ పెద్దలు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.




